భళారే బాలయ్య – మాస్ NBK 106 లోడింగ్!

నటసింహా నందమూరి బాలకృష్ణ గుండుతో ఉన్న పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : January 20, 2020 / 06:21 AM IST
భళారే బాలయ్య – మాస్ NBK 106 లోడింగ్!

Updated On : January 20, 2020 / 6:21 AM IST

నటసింహా నందమూరి బాలకృష్ణ గుండుతో ఉన్న పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..

నటసింహా నందమూరి బాలకృష్ణ న్యూ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గుండుతో నిండు చందమామలా.. వైట్ అండ్ వైట్‌లో ఉన్న బాలయ్యను చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్‌కి గురయ్యారు. బాలయ్య లుక్ చూసి ఇతర హీరోల అభిమానులు సైతం ఆయన డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పడం విశేషం.

Image

ఇంతకుముందు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ లో బాలయ్య గుండుతో కనిపించాడు. బాలయ్య తన తర్వాతి సినిమాను ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీళ్ల కలయికలో తెరకెక్కనున్న NBK 106 ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Read Also : పెదనాన్న బర్త్‌డే పార్టీలో ప్రభాస్ – ఘనంగా కృష్ణంరాజు 80వ జన్మదిన వేడుకలు..

Image

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసమే బాలయ్య గుండు చేయించుకున్నాడని, బోయపాటి, బాలయ్యను మరోసారి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో చూపించనున్నాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశానికి హాజరైనప్పుడు బాలయ్య దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. త్వరలో NBK 106 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.  

Image