ఘనంగా నందమూరి చైతన్య కృష్ణ నిశ్చితార్థం.. వధువు ఎవరో తెలుసా!

  • Publish Date - December 7, 2020 / 07:09 PM IST

Nandamuri Chaitanya Krishna Engagement: స్వర్గీయ నందమూరి తారక రామారావు మొట్టమొదటి మనువడు, ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయ కృష్ణ తనయుడు నందమూరి చైతన్య కృష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నారు. రేఖ గుమ్మడితో చైతన్య కృష్ణ నిశ్చితార్థం డిసెంబర్ 5న నందమూరి, గుమ్మడి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగింది.

జయ కృష్ణ, బాలకృష్ణ, మోహన కృష్ణ, కళ్యాణ్ రామ్, తేజస్విని దంపతులు తదితరులు హాజరై చైతన్య కృష్ణ, రేఖలను ఆశీర్వదించారు. కార్యక్రమం ఆద్యంతం అన్ని వ్యవహారాలు బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.



కాగా సీనియర్ నటి రాధిక రాడాన్ మీడియా ద్వారా నిర్మించిన ‘ధమ్’ సినిమాతో నటుడిగా పరిచయం అయిన చైతన్య కృష్ణ ఆ తర్వాత బిజినెస్ వ్యవహారల్లో బిజీ అయిపోయారు. గత 18 ఏళ్లుగా కాలిఫోర్నియాలో నివాసముంటున్న రేఖను ఆయన వివాహం చేసుకోబోతున్నారు.



రేఖ ఎవరో కాదు.. ఎన్టీఆర్‌తో పలు సూపర్ హిట్ చిత్రాలు తీసిన విజయ వాహిని స్టూడియోస్ అధినేత ఆలూరి చక్రపాణి కుటుంబానికి చెందిన వ్యక్తి.. త్వరలో వివాహానికి సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు నందమూరి కుటుంబ సభ్యులు.