Devil 2 : ‘డెవిల్’ సినిమా రిలీజ్ రోజే సీక్వెల్ అనౌన్స్.. డెవిల్ 2 గురించి కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

డెవిల్ కి పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.

Nandamuri Kalyan Ram Announced Devil 2 Movie Full Details Here

Devil 2 Announcement : నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ నామా దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో కనిపించింది. డెవిల్ నేడు డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్వతంత్రం ముందు సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డెవిల్ మంచి విజయం సాధించింది. డెవిల్ కి పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.

Also Read : Mahesh Babu -Teja Sajja : అప్పుడు మహేష్ బాబుకి కొడుకుగా చేసి.. ఇప్పుడు మహేష్‌తో పోటీగా వస్తున్న తేజ సజ్జా..

ఈ సెలబ్రేషన్స్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. డెవిల్ 2 సినిమా కచ్చితంగా ఉంటుంది. ఇదే టీంతో ఉంటుంది. 2024లో డెవిల్ 2 సినిమా మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తాం. ఈ సినిమా షూట్ మొదలైన 10 రోజులకే శ్రీకాంత్ పార్ట్ 2 కథ కూడా చెప్పాడు. సీక్రెట్ సర్వీస్ తో కథని ముందుకి తీసుకెళ్లొచ్చు. ఆ లైన్ నాకు బాగా నచ్చింది. డెవిల్ 2 సినిమా 1940 సమయంలో ఉంటుంది. అలాగే 2000 సమయంలో కూడా ఉంటుంది. రెండు కాలాలకు సంబంధించి కథ సాగుతుంది అని చెప్పారు.