Mahesh Babu -Teja Sajja : అప్పుడు మహేష్ బాబుకి కొడుకుగా చేసి.. ఇప్పుడు మహేష్‌తో పోటీగా వస్తున్న తేజ సజ్జా..
మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ రెండు సినిమాలు జనవరి 12నే రాబోతున్నాయి.

Mahesh babu Guntur Kaaram Teja Sajja Hanuman Interesting competition for Sankranthi
Mahesh Babu -Teja Sajja : ఈ సంక్రాంతికి(Sankranthi) చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో పాటు తేజ సజ్జా(Teja Sajja) హీరోగా వస్తున్న హనుమాన్(Hanuman) సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా కావడం, మాస్ టైటిల్ తో ఇప్పటివరకు వచ్చిన మాస్ అప్డేట్స్ తో సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండక్కి స్టార్ హీరో వస్తుండటంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని ఎదురు చూస్తున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలంటే మంచి పేరు ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమంతుడిని ఆధారంగా ఓ ఆసక్తికర సూపర్ హీరో కథని రాసుకొని హనుమాన్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాని దాదాపు ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Boran Antunna Song : బిగ్‌బాస్ ఫేమ్ అరియనా, రోల్ రైడా.. ‘బోరాన్ అంటున్న’ సాంగ్ చూశారా?
మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ రెండు సినిమాలు జనవరి 12నే రాబోతున్నాయి. దీంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. ఒక స్టార్ హీరోతో చిన్న హీరో అని, మాస్ కమర్షియల్ ఫ్యామిలీ సినిమాతో సూపర్ హీరో సినిమా పోటీ అని అంతా భావిస్తున్నారు. అయితే తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన యువరాజు సినిమాలో తేజ సజ్జా మహేష్ కి కొడుకుగా నటించాడు. ఇప్పుడు 23 ఏళ్ళ తర్వాత అదే తేజ సజ్జా మహేష్ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తుండటంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై తేజ కానీ, మహేష్ కానీ ప్రమోషన్స్ లో స్పందిస్తారేమో చూడాలి.