Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బింబిసారా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఫాంటసీ యాక్షన్...

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బింబిసారా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఫాంటసీ యాక్షన్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Bimbisara: ఆగష్టు 5న బింబిసారుడి సింహాసన అధిరోహణం!

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ఓ చిన్న ట్రైలర్ గ్లింప్స్ వీడియోతో అనౌన్స్ చేశారు బింబిసారా చిత్ర యూనిట్. ‘‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు..’’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ ట్రైలర్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 4న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు ప్రకటించింది.

Bimbisara: పండగపూట బింబిసారుడి ఆగమనం!

ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మల్లిడి వశిష్ట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, కేథరిన్ త్రేజా, వరీనా హుస్సేన్, సంయుక్తా మీనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు