Bimbisara: పండగపూట బింబిసారుడి ఆగమనం!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను అనౌన్స్ చేసి...

Bimbisara: పండగపూట బింబిసారుడి ఆగమనం!

Nandamuri Kalyan Ram Bimbisara Release Date Announcement

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను అనౌన్స్ చేసి, తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తిగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కళ్యాణ్ రామ్ తీసుకొస్తున్నట్లు చిత్ర యనిట్ గతంలోనే వెల్లడించింది. కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడట.

Bimbisara: కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగిన కీరవాణి?

మగధ సామ్రాజ్యపు రాజు బింబిసారా గురించి మనందరికీ తెలుసు. అయితే కళ్యాణ్ రామ్ చూపించబోయే బింబిసారుడు ఎలా ఉంటాడా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్‌తో మనకు కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘బింబిసారా’ చిత్ర రిలీజ్ డేట్‌ను ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 2న ఉదయం 11.34 గంటలకు అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఈ సినిమాపై మరోసారి అందరి చూపులు పడ్డాయి. హిస్టారికల్ కంటెంట్‌కు ఫిక్షన్ అంశాన్ని జోడించి తెరకెక్కిస్తున్న ఈ సినిమా, కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది.

NTR in Kalyan Ram’s Bimbisara: బింబిసార సెకండ్ పార్ట్‌లో ఎన్టీఆర్

ఈ సినిమాను మల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేస్తుండగా, చిరంతన్ భట్, ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కేథరిన్ త్రేసా, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి బింబిసారుడి ఆగమనం ఎప్పుడో రేపు తేలిపోనుంది.