Bimbisara: కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగిన కీరవాణి?

ఎవరు ఎన్ని అనుకున్నా.. దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన అన్న సంగీత దిగ్గజం కీరవాణిల కుటుంబానికి నందమూరి కుటుంబంతో మంచి సంబంధాలే ఉంటాయి.

Bimbisara: కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగిన కీరవాణి?

Bimbisara

Updated On : March 25, 2022 / 4:27 PM IST

Bimbisara: ఎవరు ఎన్ని అనుకున్నా.. దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన అన్న సంగీత దిగ్గజం కీరవాణిల కుటుంబానికి నందమూరి కుటుంబంతో మంచి సంబంధాలే ఉంటాయి. ఇక, ఆరంభం నుండే కలిసి కెరీర్ స్టార్ట్ చేసిన రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్ మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక్క రాజమౌళి మాత్రమే కాదు.. రాజమౌళి-కీరవాణీల కుటుంబంతో కూడా తారక్ అనోన్యంగా కలిసిపోతాడు. వాళ్ళ కుటుంబాలను కూడా తారక్ నా కుటుంబమే అనుకుంటానని చెప్పుకొస్తాడు.

NTR in Kalyan Ram’s Bimbisara: బింబిసార సెకండ్ పార్ట్‌లో ఎన్టీఆర్

కాగా.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కెరీర్ కోసం కూడా తపన పడుతున్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా సక్సెస్ దక్కని కళ్యాణ్ రామ్ త్వరలోనే బింబిసారా అనే సినిమాతో రాబోతున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు ఓ ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తయి రిలీజ్ కి సిద్ధంగా ఉందట. ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు కూడా ఆ మధ్య వినిపించగా ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఆసక్తికర ప్రచారం మొదలైంది.

Bimbisara : అసలు ఎవరీ ‘బింబిసార’? కళ్యాణ్ రామ్ డేరింగ్ స్టెప్..

ఈ భారీ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సాంగ్ కంపోసర్ గా చిరంతన్ భట్ అని మరో పేరు కూడా యాడ్ చేశారు. అయితే.. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క సాంగ్ కూడా బయటకి రాలేదు. ఇప్పుడు ఈ సినిమా కోసం కీరవాణి రంగంలోకి దిగినట్లు టాక్ మొదలైంది. హిస్టారికల్ సోషియో ఫాంటసీ సినిమాలకు కీరవాణి పెట్టింది పేరు. సంగీత రంగంలో ఎంతో అనుభవమున్న కీరవాణి చేత బింబిసారా సినిమాకు బీజీఎమ్ తో పాటు ఓ కీలకమైన పాటను చేయిస్తున్నట్లు తెలుస్తుంది. కీరవాణి వర్క్ పూర్తయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.

Bimbisara: కళ్యాణ్ రామ్ ఊహించని ట్రాన్స్‌ఫర్మేషన్.. కలిసొచ్చేనా?