తారకరాముడి 97వ జయంతి..

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 97వ జయంతి..

  • Publish Date - May 27, 2020 / 10:59 AM IST

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 97వ జయంతి..

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డా.నందమూరి తారక రామారావు.. ఈ పేరు వింటే తెలుగు ప్రజల తనువులు పులకరిస్తాయి. కళామతల్లి ముద్దుబిడ్డగా, వెండితెర రాముడిగా, కృష్ణుడిగా, పేద ప్రజల దేవుడిగా ఎనలేని కీర్తి గడించిన ఎన్టీఆర్ జయంతి(మే 28).. 2020 మే 28న అన్నగారి 97వ జయంతి. నిమ్మకూరులో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, నాటకాల్లో అనుభవం సంపాదించి, చలనచిత్ర రంగంలో మకుటంలేని మహరాజుగా వెలుగొంది, రాజకీయ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని సంచలనం సృష్టించిన ఘనత తారక రామునిది.

వెండితెరపై ఆయన ప్రాణం పోసిన పాత్రలు కోకొల్లలు.. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం.. పాత్ర ఏదైనా తన నటనతో వన్నె తెచ్చేవారు అన్నగారు. రాముడు, కృష్ణుడు ఇలానే ఉండేవారేమో అన్నంతగా ఆ పాత్రల్లో ఆయన ఒదిగిన తీరు అద్భుతం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9నెలల్లో అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించారు.

ఎన్టీఆర్.. ఈ పేరు ఒక ప్రభంజనం, ఒక చరిత్ర, భావితరాలకు ఆదర్శం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తారక రాముడి ఖ్యాతి తెలుగు వెలుగు ఉన్నంత కాలం, తెలుగు వెలుగుతూ ఉన్నంత కాలం శాశ్వతం.

Read: రాముడిగా సూపర్‌స్టార్..