Pawan Kalyan
Nandamuri Tarakarathna : ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు తారకరత్న. ఈ సినిమాతో పర్వాలేదనిపించాడు, ఆ తర్వాత తను చేసిన సినిమాల్లో ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’ తప్ప మిగిలినవి ఏవి అంతగా ఆడలేదు. దీంతో తారకరత్న హీరో కెరీర్ తొందరగానే ముగిసింది. హీరోగా కెరీర్ ముగియడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అప్పుడప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు.
తాజాగా తారకరత్న 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తారకరత్న చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చాడు. ఈ సిరీస్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఎన్టీఆర్ గురించి, నందమూరి ఫ్యామిలీ గురించి, ఏపీ రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.
తారకరత్న ఏపీ రాజకీయాలు, టీడీపీ, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ”నాకు ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాల గురించి అవగాహన లేదు. తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు చూసుకుంటారు. బాబాయ్ బాలకృష్ణ, అన్న జూనియర్ ఎన్టీఆర్, నేను టీడీపీ కోసమే పని చేస్తాం, చంద్రబాబు సూచనల మేరకే ముందుకు సాగుతాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను బాబాయ్ అని పిలుస్తాను. పవన్ బాబాయ్ ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆయన స్థాయిలో ఆయన పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పవన్ బాబాయ్ సినిమాలు చూశాను. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఉండదు అనిపిస్తుంది. కానీ పొత్తుల వ్యవహారం చంద్రబాబు గారు చూసుకుంటారు” అని తెలిపారు.
Anasuya : భర్తతో మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ
మొత్తానికి నందమూరి తారకరత్న పవన్ కళ్యాణ్ ని బాబాయ్ అని పిలవడం, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.