Ugly Story Trailer: జీవితంలో ప్రేమ ఎక్కువైతే.. అది నరకమేనా.. ఆసక్తికరంగా ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
జీవితంలో ప్రేమ ఎక్కువైతే అది చూపించే నరకం ఎలా ఉంటుంది. ఆసక్తికర కథతో వస్తున్న 'అగ్లీ స్టోరీ(Ugly Story Trailer)' మూవీ.
- V Santhosh Kumar
- Published on- May 6, 2026 / 03:42 PM IST
nandu, avika gor ugly story movie trailer out now
Ugly Story Trailer; టాలీవుడ్ యంగ్ హీరో నందు, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ్ స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అవికా గోర్ కథానాయికగా నటించింది. మే 22న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Nithin-Ritika Nayak: లాంఛనంగా మొదలైన ‘నితిన్’ కొత్త మూవీ.. హీరోయిన్ గా రితికా నాయక్
ఇందులో నందు సైకో తరహా పాత్రలో ఒదిగిపోయి నెగటివ్ షేడ్స్ ఉన్న నటనతో ఆకట్టుకున్నాడు. చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న అమ్మాయిని వేధిస్తూ, బలవంతంగా పెళ్లి చేసుకుని ఆమెకు నరకం చూపించే యువకుడిగా నందు నటన హైలైట్‌గా నిలిచింది(Ugly Story Trailer). శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, ఆసక్తికరమైన కథనం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ విభిన్నమైన పాత్ర నందుకు కచ్చితంగా మంచి విజయాన్ని అందిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
