Hi Nanna : ప్రభాస్‌తో పోటీ వద్దని ‘హాయ్ నాన్న’ని ముందే తీసుకొస్తున్న నాని.. వెంకీ మామ కూడా తప్పుకుంటాడా?

సలార్ డేట్ అనౌన్స్ చేయకముందే డిసెంబర్ 22న తెలుగులో నాని హాయ్ నాన్న సినిమా, వెంకటేష్ సైంధవ్ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ అదే డేట్ ఎనౌన్స్ చేయడంతో ఈ రెండు సినిమాలు ముందుకి లేదా వెనక్కి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

Nani Hi Nanna Movie will Prepone due to Prabhas Salaar Movie New Date

Hi Nanna Movie : ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పది డిసెంబర్ 22న రిలీజ్ కానుందని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో అదే రోజు షారుఖ్(Shahruh Khan) డుంకి(Dunki) సినిమాతో రానున్నాడు. దీంతో రెండు భారీ సినిమాలు ఒకేసారి వస్తుండటంతో అదే డేట్ అనుకున్న వేరే సినిమాలు అన్ని సైడ్ అయిపోవాలని చూస్తున్నాయి. ప్రభాస్, షారుఖ్ సినిమాలు బాక్సాఫీస్ వద్దకి వస్తే ఎంత మంచి సినిమాలు అప్పుడు రిలీజయినా కలెక్షన్స్ రాకపోవచ్చు.

అయితే సలార్ డేట్ అనౌన్స్ చేయకముందే డిసెంబర్ 22న తెలుగులో నాని హాయ్ నాన్న సినిమా, వెంకటేష్ సైంధవ్ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ అదే డేట్ ఎనౌన్స్ చేయడంతో ఈ రెండు సినిమాలు ముందుకి లేదా వెనక్కి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే నాని హాయ్ నాన్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది. నేచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తరువాత ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ సినిమాతో రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుంది. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటిస్తుండగా ఖుషి సినిమాకి సంగీతం అందించిన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ ‘హేశం అబ్దుల్ వహాబ్’ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని సినిమాని డిసెంబర్ 7నే రిలీజ్ చేయాలనుకుంటున్నాడట. ఎలాగో షూటింగ్ అయిపోతుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్స్ త్వరగా పూర్తి చేసి సలార్ హంగామా మొదలవ్వకముందే రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నాడు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక వెంకటేష్ సినిమా సైంధవ్ వాయిదా పడుతుందని సమాచారం.

హిట్, హిట్ 2 లాంటూ సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, నవాజుద్దీన్ సిద్ధికి, ఆర్య.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా చివరి షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ సినిమా డిసెంబర్ 22 అనౌన్స్ చేయడంతో వెంకటేష్ సైంధవ్ కూడా వాయిదా పడొచ్చు అని సమాచారం.

Also Read : Naveen Chandra : నవీన్ చంద్ర భార్య గురించి తెలుసా? తను కూడా సినిమా ఇండస్ట్రీనే.. త్వరలో డైరెక్టర్ గా?

ఇటీవల ప్రభాస్ సినిమా వాయిదా పడటంతో ఆ ప్లేస్ లోకి పలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కొత్త డేట్ అనౌన్స్ చేయడంతో ఆ డేట్ లో ఉన్న సినిమాలు వాయిదా పడుతున్నాయి. మొత్తానికి ప్రభాస్ సినిమా వేరే హీరోల సినిమా డేట్స్ ని మార్చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు