Nani movie with that hit director under dil raju production
Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ‘అంటే సుందరానికి’ ఫేమ్ వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ అనే ఓ మాస్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ వీడియో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా నేడు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ పుట్టినరోజునాడే నాని మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది.
దిల్ రాజు నిర్మాణంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని.. రీసెంట్ గా ‘బలగం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘వేణు’ డైరెక్ట్ చేయబోతున్నాడంటూ గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ ఒక ఫొటోతో కన్ఫార్మ్ చేశారు. నాని పుట్టినరోజు కావడంతో.. నిర్మాత శిరీష్, దర్శకుడు వేణు హీరోని కలుసుకొని బర్త్ డే విషెస్ తెలియజేసారు.
Also read : Tarun : క్రికెట్ ఆడటానికి వెళ్లి కంగారూలతో ఆడుకుంటున్న తరుణ్
ఇక ఆ ఫోటోలను దిల్ రాజు బ్యానర్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయడంతో.. ఈ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయ్యిందని ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం. బలగం కథకి మంచి పేరు రావడంతో.. వేణు రైటింగ్స్ పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తగ్గట్లే వేణు.. నాని సినిమా కథని సిద్ధం చేస్తున్నారట.
Producers #Shirish garu and @HR_3555 along with director @VenuYeldandi9 extended their heartfelt birthday wishes to the ever-talented Natural ⭐@NameisNani !
#HappyBirthdayNani pic.twitter.com/0irGTemKwp
— Sri Venkateswara Creations (@SVC_official) February 24, 2024
ఈ క్రేజీ కాంబినేషన్ తో పాటు మరో సూపర్ డైరెక్టర్ తో కూడా నాని మూవీని సెట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో OG చేస్తున్న సుజిత్ తో నాని ఓ సినిమా చేయబోతున్నారు. ఆల్రెడీ కథ కూడా లాక్ అయ్యిందట. మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఆ సినిమా సాగబోతుందంటూ సమాచారం. డివివి నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతుంది. నాని నుంచి ఇప్పటి వరకు మాఫియా బ్యాక్‌డ్రాప్ జోనర్ సినిమా రాలేదు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.