Hi Nanna Review : హాయ్ నాన్న మూవీ రివ్యూ.. నాన్న సెంటిమెంట్ మాత్రమే కాదు.. ప్రేమ సన్నివేశాలతో కూడా..

శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నేడు డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

Nani Mrunal Thakur Hi Nanna Movie Review and Rating

Hi Nanna Review : న్యాచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన 30వ సినిమాగా ‘హాయ్ నాన్న’(Hi Nanna)తో రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నేడు డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

కథ విషయానికి వస్తే..
విరాజ్(నాని) ఒక ఫోటోగ్రాఫర్. సొంత స్టూడియో పెట్టుకొని ముంబైలో మోడల్స్ కి ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ తన కూతురు మహితో(కియారా ఖన్నా) కలిసి జీవిస్తూ ఉంటాడు. తన కూతురుకి ఓ అరుదైన వ్యాధి ఉండటంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయితే చిన్నప్పట్నుంచి అమ్మ గురించి తెలియకుండా పెంచడంతో అమ్మ కథ చెప్పమని మహి విరాజ్ ని అడుగుతూ ఉంటుంది. విరాజ్ చెప్తానని చెప్పకపోవడంతో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మహి. అనుకోకుండా యష్ణ(మృణాల్ ఠాకూర్) మహికి పరిచయం అవుతుంది. మహి, యష్ణ మంచి స్నేహితులు అవుతారు. యష్ణ వల్ల విరాజ్ మహికి అమ్మ కథ చెప్పాల్సి వస్తుంది. మహి వాళ్ళ అమ్మ ఎవరు? యష్ణ విరాజ్ లైఫ్ లోకి వస్తుందా? మహి హెల్త్ కి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
సినిమా ప్రారంభంలో నాని, కూతురు సెంటిమెంట్ ని చూపిస్తారు. ఆ తర్వాత నాని అమ్మ కథ చెప్పమన్నప్పుడు మృణాల్ ని కథలో ఊహించి చెప్తూ ఓ ప్రేమకథని నడిపిస్తారు. ఇంటర్వెల్ లో ఓ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించనంతగా సినిమా కథని నడిపించాడు దర్శకుడు. దీంతో ఇంటర్వెల్ తర్వాత సినిమాపై ఒక హైప్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో నాని – మృణాల్ ఠాకూర్ సీన్స్, పాప హెల్త్ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగదీస్తారు. చివర్లో మరో ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తారు డైరెక్టర్.

నటీనటుల విషయానికి వస్తే..
నాని ఎప్పట్లాగే తన న్యాచురల్ నటనతో మెప్పిస్తాడు. మృణాల్ ఠాకూర్ ఓ పక్క తన అందంతో మెప్పిస్తునే ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొడుతుంది. నాని కూతురుగా కియారా ఖన్నా అద్భుతంగా చేసిందనే చెప్పొచ్చు. నాని ఫ్రెండ్ గా ప్రియదర్శి, మృణాల్ తల్లి, జయరాం తమ పాత్రల్లో మెప్పిస్తారు. శృతి హాసన్ ఓ పాటలో మెరిపిస్తుంది.

సాంకేతిక విలువలు..
నాని లాంటి స్టార్ సినిమా కాబట్టి నిర్మాణ విలువలు ఆటోమేటిక్ గా బాగుంటాయి. ఇందులో నాని ఫొటోగ్రాఫర్ గా పనిచేశాడు కాబట్టి కెమెరా విజువల్స్ మరింత అందంగా చూపించారు. నటీనటులందర్నీ మరింత అందంగా చూపించారు కెమెరా విజువల్స్ తో. ముఖ్యంగా ఎమోషన్ BGM, సినిమా అంతా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహద్. ఇక సాంగ్స్ మాత్రం అంతగా ఆకట్టుకోవు. సినిమా అంతా ముంబై, గోవా, కూనూర్ లోనే తీయడంతో అందమైన లొకేషన్స్ చాలా ఉంటాయి.

Also Read : గుంటూరు కారం నుంచి క్రేజీ అప్‌డేట్‌.. రొమాంటిక్ సాంగ్‌

మొత్తంగా హాయ్ నాన్న కేవలం నాన్న సెంటిమెంట్ మాత్రమే కాకుండా ప్రేమ, పెళ్లి ఎమోషన్స్ తో కూడా నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..

ట్రెండింగ్ వార్తలు