నాని, సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణల కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాకి ‘వ్యూహం’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు..
నేచురల్ స్టార్ నానిని అష్టా-చమ్మాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, తర్వాత నానితో జెంటిల్ మన్ సినిమా చేసాడు. ఈ రెండు సినిమాలూ హీరోగా నానికి మంచి మైలేజ్ తెచ్చిపెట్టాయి. ఈ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడవ సినిమా రాబోతుంది. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమా మల్టీస్టారర్.. నానితో పాటు యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటించనున్నాడు. నాని, సుధీర్ ఇద్దరి క్యారెక్టర్స్ కూడా కీలకంగా ఉంటాయట. ఈ మూవీకి ‘వ్యూహం’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
అష్టా-చమ్మా, జెంటిల్ మన్ సినిమాలతో నానికి, సమ్మోహనంతో సుధీర్ బాబుకి మంచి సినిమాలు ఇచ్చిన ఇంద్రగంటి, ఇద్దరితో కలిపి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి మరి. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. జెర్సీ తర్వాత నాని, గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కోసం రెడీ అవుతున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చెయ్యనున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది.