Nani : దసరా కాంబినేషన్ ఈజ్ బ్యాక్.. పోస్టర్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసిన నాని..

దసరా కాంబినేషన్ మళ్ళీ వచ్చేస్తుంది. ఏడాది పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ పోస్టర్‌ రిలీజ్ చేసారు.

Nani re united with Dasara director Srikanth Odela for his 33 movie

Nani : గత ఏడాది నాని ‘దసరా’ వంటి మాస్ సినిమాతో, ‘హాయ్ నాన్న’ వంటి క్లాస్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్స్ ని అందుకున్నారు. ఈ రెండిటిలో దసరా సినిమా నానిని మొదటిసారి ఊర మాస్ గా చూపించడమే కాదు, నాని కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచి ఒక మైల్ స్టోన్‌గా మారింది. దీంతో నాని ఫ్యాన్స్ లో ఈ మూవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది.

శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రిలీజయ్యి నేటితో (మార్చి 30) ఏడాది పూర్తి అయ్యింది. దీంతో అభిమానులంతా ఈ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వస్తున్నారు. అయితే నాని జ్ఞాపకాలతో పాటు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ని కూడా తీసుకు వచ్చారు. ఫ్యాన్స్ అంతా నాని అండ్ శ్రీకాంత్ కాంబినేషన్ లో ఓ సినిమాని కోరుకుంటున్నారు. ఆ కోరికనే నాని నేడు నిజం చేసేసారు.

Also read : Dil Raju – Vaishnavi Chaitanya : స్టేజి పై పాట పాడి అదరగొట్టిన దిల్ రాజు, వైష్ణవి చైతన్య..

ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ని ఇవ్వడమే కాదు, పోస్టర్ ని కూడా తీసుకు వచ్చేసారు. ఆ పోస్టర్ లో ఇలా రాసుకొచ్చారు.. “నువ్వు లీడర్ అయితే, నీకు గుర్తింపు అవసరం లేదు” అంటూ పేర్కొన్నారు. మొత్తం మీద పోస్టర్ చూస్తుంటే.. హక్కులు కోసమో, లేదా బ్రతుకు కోసమో పోరాడే ఒక లీడర్ కథ అని తెలుస్తుంది. మరి దసరాతో అదరగొట్టిన ఈ కాంబినేషన్.. ఇప్పుడు ఎలా మెప్పిస్తుందో చూడాలి.

కాగా నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు. ఇక బలగం వేణుతో కూడా నాని ఓ సినిమాకి సైన్ చేసారు. అది ఎప్పుడు మొదలు కాబోతుందో అనేది తెలియాల్సి ఉంది.