Nani Sensational Comments on his Upcoming Movies
Nani : న్యాచురల్ స్టార్ నాని ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ కొత్త కొత్త సినిమాలతో పలకరిస్తున్నాడు, వరుస హిట్స్ కొడుతున్నాడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో తన క్యరెక్టర్ లో వేరియేషన్ చూపించి హిట్స్ కొట్టాడు. అయితే నాని ఎప్పట్నుంచో మాస్ హీరోగా మారాలనుంటున్నాడు. ఆ క్రమంలోనే దసరా, సరిపోదా శనివారం సినిమాలు తీసాడు.
తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దసరా సినిమాలో నరకడాలు, వైలెన్స్ చాలా ఉంది కాబట్టి పిల్లల్ని సినిమాకు తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచించాను. సరిపోదా శనివారం సినిమాకు పిల్లల్ని తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో మరింత వైలెన్స్ ఉంటుంది. పిల్లలకి ఎంట్రీ కూడా లేదు అని అన్నాడు. దీంతో నాని రాబోయే సినిమాల్లో మరింత రక్తపాతం, వైలెన్స్ చూపించబోతున్నాడని, ఇంకా మాస్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.
Also Read : Pawan Kalyan OG Song : పవన్ కళ్యాణ్ OG కోసం.. పాట పడనున్న తమిళ్ స్టార్..
దసరా డైరెక్టర్ శ్రీకాంత్ తో తీసే సినిమాలో నాని మరింత వైలెంట్ గా కనిపిస్తాడని, అలాగే హిట్ 3లో కూడా నాని అంతే వైలెంట్ గా కనిపించనున్నాడని, ఈ రెండు సినిమాలకు A సర్టిఫికెట్ వస్తుందని, అందుకే పిల్లల్ని ఈ సినిమాలకు రానివ్వరని తెలుస్తుంది. మరి రాబోయే సినిమాలతో అయినా నాని పూర్తి మాస్ హీరోగా మారతాడా చూడాలి.