Paradise Censor Review: ‘ది ప్యారడైజ్’కి A సర్టిఫికెట్.. బాబోయ్ ఎన్ని కట్స్ ఇచ్చారో తెలుసా.. సినిమా నిడివి ఎంతంటే..?

Paradise Censor Review: అనుకున్నట్టే ది ప్యారడైజ్ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. (The Paradise)

  • Updated on- September 21, 2026 / 05:39 PM IST

Nani The Paradise Movie Censor Certificate Changes

The Paradise Censor Review: నాని ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 24 ఈ సినిమా భారీగా రిలీజ్ కాబోతుంది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో వైలెన్స్, బూతులు ఎక్కువగా ఉన్నాయని గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయినప్పుడే అర్ధమయింది. ది ప్యారడైజ్ సినిమాకు A సర్టిఫికెట్ ఇస్తారని ముందు నుంచే ఊహించారు.

అనుకున్నట్టే ది ప్యారడైజ్ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ తర్వాత ది ప్యారడైజ్ ఫైనల్ నిడివి 2 గంటల 54 నిమిషాల 4 సెకండ్స్. దాదాపు 25 సెకండ్స్ సీన్స్ డిలీట్ చేయమన్నారు. అలాగే ఒక నిమిషం 25 సెకండ్స్ కంటెంట్ మార్చమన్నారు. ప్రగ్నెంట్ వుమెన్ పై టార్చర్ సీన్స్ ని మార్చమన్నారు. గ్లింప్స్ లో చూపించిన బూతుపదం సినిమాలో నాలుగు సార్లు రాగా దాన్ని మ్యూట్ చేయమన్నారు. అలాగే మరికొన్ని పదాలు కూడా మ్యూట్ చేసారు. వైలెన్స్, రక్తపాతం ఉన్న కొన్ని సీన్స్ లో విజువల్స్ మార్చమన్నారు. దాదాపు కట్స్, మాడిఫికేషన్స్ అన్ని కలిపి 21 మార్పులు చెప్పారు సెన్సార్ బోర్డు.

Also See – Serial Actress Sireesha : రెండో పెళ్లి తర్వాత భర్త, కొడుకుతో సీరియల్ నటి శిరీష్.. ఫొటోలు..

నాని సినిమాకు ఇన్ని కట్స్ ఇచ్చి A సర్టిఫికెట్ ఇవ్వడంతో హిట్ 3 కంటే ఎక్కువ యాక్షన్, వైలెన్స్, రక్తపాతం ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ రేంజ్ వైలెన్స్ తో ది ప్యారడైజ్ సినిమాలో నాని ఏ రేంజ్ లో మెప్పిస్తాడా చూడాలి.