×
Ad

Nara Lokesh : ‘ఒరిజినల్ గాడ్’ అంటూ పవన్ కళ్యాణ్ OG సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..

ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా OG సినిమాపై స్పెషల్ ట్వీట్ వేశారు. (Nara Lokesh)

Nara Lokesh

Nara Lokesh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతాగానో ఎదురు చూస్తున్న OG సినిమా రిలీజయి థియేటర్స్ లో అదరగొడుతుంది. ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా OG సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా OG సినిమాని చూడటానికి క్యూ కట్టారు.(Nara Lokesh)

అనేకమంది హీరోలు, దర్శక నిర్మాతలు, హీరోయిన్స్, టాలీవుడ్ ప్రముఖులంతా పవన్ OG సినిమాకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా OG సినిమాపై స్పెషల్ ట్వీట్ వేశారు.

Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..

నారా లోకేష్ తన ట్వీట్ లో.. #OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది, పవన్ ఫ్యాన్స్ లోకేష్ కి థ్యాంక్యూ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : OG Sequel : OG సీక్వెల్ అనౌన్స్.. ఓజీ 2 కథ ఇదే.. ఫ్యాన్స్ కి పండగే..