Rajinikanth: నరసింహా సినిమాకు సీక్వెల్.. స్వయంగా ప్రకటించిన రజినీకాంత్.. టైటిల్ ఏంటో తెలుసా..
నరసింహా సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు రజినీకాంత్(Rajinikanth). ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు.
Rajinikanth announces sequel to blockbuster Narasimha
Rajinikanth; సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే నరసింహ అనే చెప్పాలి. ఈ సినిమాలో రజినీకాంత్(Rajinikanth) స్టైల్, డైలాగ్స్, ఎమోషల్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకే, ఇన్నేళ్లు గడుస్తున్నా ఈ సినిమాలో అందరి మనస్సులో అలా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చినా పనిగట్టుకొని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. నీలాంబరిగా రమ్యకృష్ణ పాత్ర ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది.
అవును, నరసింహా సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు రజినీకాంత్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. “నరసింహా విడుదల సమయంలో ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టిమరీ థియేటర్లలోకి వచ్చిన సినిమా చూశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. నేను చేసిన రోబో సినిమాకు సీక్వెల్ గా 2.0, జైలర్ కి జైలర్ 2 చేస్తున్నాను. అలా నరసింహ సినిమాకి కూడా రెండో భాగం ఉండే బాగుటుంది అనిపించింది. ఈ సినిమాకు ‘నీలాంబరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ ని అనుకుంటున్నాం.
నిజానికి నరసింహ కథను ముందు ఐశ్వర్యారాయ్ అనుకున్నాం. కానీ, ఆమె సుముఖత చూపించలేదు. ఆ తరువాత శ్రీదేవి, మాధురీదీక్షిత్ కూడా అనుకున్నాం. కానీ, చివరకు రమ్యకృష్ణ అయితే న్యాయం చేయగలరని నమ్మము”అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు నెల్సన్ కుమార్ తో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
