Dekh lenge Saala Song Promo: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పవన్ స్టెప్ వేస్తే భూకంపం.. అదిరిందిరోయ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Dekh lenge Saala Song Promo: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పవన్ స్టెప్ వేస్తే భూకంపం.. అదిరిందిరోయ్..

Dekh Lenge Saala song promo released from Pawan Kalyan Ustaad Bhagat Singh Movies

Updated On : December 9, 2025 / 6:39 PM IST

Dekh lenge Saala Song Promo: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాబోలో రాబోతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అది కూడా ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Shriya Sharma: చిరు ఎత్తుకున్న ఈ చిన్నారి గుర్తుందా.. ఎలా మారిపోయిందో చూడండి.. ఫోటోలు

మేకర్స్ చెప్పిన ప్రకారం 2026 ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ‘దేఖ్ లేంగే సాలా’ అనే స్టైలిష్ సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు మేకర్స్. రాక్ స్టార్ దేవి అందించిన ఆ పాట ఒక రేంజ్ లో ఉంది. ఇక పాటలు పవన్ చేసిన డాన్స్ క్రేజీ ఉంది. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో డాన్స్ చేయడం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో షేక్ చేయనుంది అని క్లియర్ గా అర్థం అవుతోంది. ఇక ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న విడుదల కానుంది. మరి ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంది అంటే ఫుల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.