Karthi: తమిళ ఇండస్ట్రీ ప్రత్యేకత ఏంటి.. మనకు ఎందుకు భయం.. తెలుగులోలా మనం చేయలేమా..

తమిళ స్టార్ కార్తీ(Karthi) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలకు లేని భయం మనకు ఎందుకు అంటూ తమిళ ఇండస్ట్రీని ప్రశ్నించాడు. తాజాగా ఆయన హీరోగా చేస్తున్న వా వాతియార్ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు.

Karthi: తమిళ ఇండస్ట్రీ ప్రత్యేకత ఏంటి.. మనకు ఎందుకు భయం.. తెలుగులోలా మనం చేయలేమా..

Tamil hero Karthi heaps praise on Telugu industry

Updated On : December 9, 2025 / 8:22 PM IST

Karthi: తమిళ స్టార్ కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలకు లేని భయం మనకు ఎందుకు అంటూ తమిళ ఇండస్ట్రీని ప్రశ్నించాడు. తాజాగా ఆయన హీరోగా చేస్తున్న వా వాతియార్ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సినిమాను దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్లో కార్తీ(Karthi) మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Rajinikanth: నరసింహా సినిమాకు సీక్వెల్.. స్వయంగా ప్రకటించిన రజినీకాంత్.. టైటిల్ ఏంటో తెలుసా..

“తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. అలాంటి సినిమాలు చేయడానికి వాళ్ళు భయపడటం లేదు. అలాగే, మలయాళం కూడా మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు. కానీ, తమిళ ఇండస్ట్రీ నుంచి మాత్రం అలాంటి సినిమాలు చేయడం లేదు. అసలు మన ప్రత్యేకత ఏంటి? వాళ్ళలాగా మనం ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నాం. ముందు భయాన్ని వదిలేయాలి. సరిహద్దులు తీసేసి తమిళ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నం అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తమిళ ఇండస్ట్రీపై కార్తీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక వా వాతియార్ గురించి మాట్లాడిన ఆయన.. “నిజానికి ఈ సినిమా నేను చేయడం సాహసం అనే చెప్పాలి. ఒకరకంగా కత్తి మీద సాము లాంటిది. ఈ సినిమాలో సీనియర్ నటుడు ఎంజీఆర్ గారి ఇమిటేషన్ కనిపిస్తుంది. దర్శకుడు ముందు అది చెప్పినప్పుడు రిజెక్ట్ చేశాను. కానీ, తరువాత అలోచించి ఒకే చెప్పను. సినిమా చేశాను. మీకు నచుతుంది అని అనుకుంటున్నాను”అంటూ చెప్పుకోచ్చాడు. మరి చాలా కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న కార్తీకి ఈ సినిమాతో హిట్ పడుతుందా చూడాలి.