×
Ad

Nara Rohith: నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. పెళ్లి తరువాత నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. (Nara Rohith)కుటుంబసభ్యుల మధ్య వధువు శిరీష లెల్లా మేడలో ఆయన తాళి కట్టారు.

Nara Rohit posts emotional post on social media after marriage

Nara Rohith: టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యుల మధ్య వధువు శిరీష లెల్లా మేడలో ఆయన తాళి కట్టారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి నారా, నందమూరి ఫ్యామిలీలు హాజరయ్యాయి. అలాగే.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, పెళ్లి అనంతరం ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Riddhi Kumar: లండన్ వెకేషన్ లో రాజాసాబ్ బ్యూటీ.. రిద్ధి కుమార్ క్యూట్ ఫోటోలు

ఈపోస్ట్ లో ఆయన.. “మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మరింత ప్రత్యేకంగా, ప్రకాశవంతంగా, అందంగా మారింది. ఈ రోజును ఇంత అద్భుతంగా మార్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. మీ ప్రేమ మాకు బలాన్ని ఇచ్చింది. ఈ మధురమైన, ఆనందమైన జ్ఞాపకాలను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. ముఖ్యంగా పెద్దమ్మ, పెదనాన్న, లోకేష్ అన్న, బ్రాహ్మణి వదిన , తేజస్విని, మామ, వసుంధర గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా, సినిమా, రాజకీయ రంగాలకు చెందిన వారందరి ప్రేమ మా హృదయాన్ని తాకింది. మా సోషల్ మీడియా స్నేహితులకు, అభిమానులకు కూడా నా కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.