Nara Rohith Girlfriend Siree Lella Act in Pawan Kalyan OG Movie
Nara Rohith : పవన్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా OG. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మళ్ళీ మొదలైంది. ముంబైలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నారా రోహిత్ కి కాబోయే భార్య శిరీష కూడా నటిచిందట. నారా రోహిత్ భైరవం సినిమాతో మే 30న రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ.. OG సినిమాలో నాకు కాబోయే భార్య శిరీష కూడా నటించారు. ఆ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది అని తెలిపారు.
Also Read : OG Movie : మళ్ళీ OG షూట్ కి బ్రేక్.. కానీ ఈసారి పవన్ వల్ల కాదు.. చెప్పిన టైంకి సినిమా రిలీజ్ అవుతుందా?
శిరీష – నారా రోహిత్ కలిసి ప్రతినిధి 2 సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడి గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారు. ఇక OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.