Naresh : నాకు ఆ లోటు ఎప్పుడూ ఉంది.. సూసైడ్ చేసుకుందామని ఇంట్లోంచి బయటకు వచ్చేసాను.. వీకే నరేష్ కామెంట్స్ వైరల్..

తాజాగా నరేష్ బ్యూటీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Naresh)

Naresh

Naresh : ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు వీకే నరేష్ ఎన్నో ఏళ్లుగా తన సినిమాలతో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. విజయ నిర్మల కొడుకుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా చాలా హిట్స్ కొట్టాడు. ఎక్కువగా కామెడీ సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. ఎక్కువగా హీరో, హీరోయిన్స్ కి తండ్రి పాత్రలు వేసి మెప్పిస్తున్నారు.(Naresh)

అంకిత్, నీలఖి జంటగా తెరకెక్కిన బ్యూటీ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నరేష్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమా కథ ఎక్కువగా తండ్రి కూతుళ్ళ ఎమోషన్ మీదే నడుస్తుంది. తాజాగా నరేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Priyanka Mohan : OG చీర కట్టుకొని వచ్చిన ప్రియాంక మోహన్.. ఆహా షోలో సందడి..

వీకే నరేష్ మాట్లాడుతూ..నాకు కూతురు లేదు అనే లోటు ఎప్పుడూ ఉండేది. సినిమాలో కూతురు ఉంటే ఇంత పడేవాడినా అని పెయిన్ ఈ సినిమాలో అనుభవించాను. సినిమాలో కూతురి పాత్రలో ఆ అమ్మాయిని చూసి నేను తండ్రి బాధ అనుభవించాను. నాకు కూతురు లేని లోటు ఉంది కానీ ఉంటే నేను ఇలాగే రియల్ లైఫ్ లో పెయిన్ అనుభవించేవాడిని అనిపించింది.

ఇవాళ్టి పిల్లలు ఏదో చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పటి పిల్లలకు కొట్టి, తిట్టి చెప్పలేము, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. మేము చెన్నైలో ఉండగా నాకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో గొడవ అయి మా అమ్మకు చెప్పకుండా సైకిల్ వేసుకొని చెన్నై బీచ్ కి వెళ్ళిపోయాను సూసైడ్ చేసుకుందామని. కానీ అక్కడికి వెళ్ళాక కొంతసేపటికి ఆకలి వేసి ఇంటికి వచ్చాను. మా అమ్మ నన్ను బాగా తిట్టింది అని తెలిపాడు.

Also See : Sobhita Dhulipala : సముద్రం వద్ద చీరకట్టులో శోభిత ధూళిపాళ.. ఎంత అందంగా ఉందో..