Priyanka Mohan : OG చీర కట్టుకొని వచ్చిన ప్రియాంక మోహన్.. ఆహా షోలో సందడి..
OG ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొంది. (Priyanka Mohan)

Priyanka Mohan
Priyanka Mohan : ప్రియాంక మోహన్ OG సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే. OG సినిమా నుంచి వచ్చిన సువ్వి సువ్వి సాంగ్ లో ఇప్పటికే ప్రియాంక ప్రేక్షకులకు కనెక్ట్ అయిపొయింది. సెప్టెంబర్ 25న OG సినిమా రిలీజ్ అవుతుండగా ఇప్పుడు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. OG భామ ప్రియాంక మోహన్ తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి వచ్చి సందడి చేసింది.(Priyanka Mohan)
తెలుగు ఓటీటీ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సింగింగ్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రతి శుక్ర, శనివారాలు కొత్త ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షోలో తమన్, సింగర్ కార్తీక్, గీతామాధురిలు జడ్జీలుగా ఉండగా శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ లు హోస్ట్ చేస్తున్నారు. ప్రతివారం ఈ షోకి స్పెషల్ గెస్ట్ ని తీసుకొస్తారు.
Also See : Priyanka Mohan: ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో భలే పోజులు
తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఎపిసోడ్ కి OG భామ ప్రియాంక మోహన్ ని తీసుకొచ్చారు. దీంతో OG ఐడల్ పార్టీ అని స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ చేసారు. ఈ OG స్పెషల్ ఎపిసోడ్స్ సెప్టెంబర్ 19, 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.
Also See : Sobhita Dhulipala : సముద్రం వద్ద చీరకట్టులో శోభిత ధూళిపాళ.. ఎంత అందంగా ఉందో..