Naresh : నాతో మంచి లైఫ్ గడపాలి మీరు.. పవిత్ర మాటలకు నరేష్ ఎమోషనల్..

ఈ ప్రెస్ మీట్ కి నరేష్ - పవిత్ర జంటగా హాజరయ్యారు. (Naresh)

Naresh : నాతో మంచి లైఫ్ గడపాలి మీరు.. పవిత్ర మాటలకు నరేష్ ఎమోషనల్..

Naresh

Updated On : January 19, 2026 / 6:00 PM IST

Naresh : సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్ర లోకేష్ కొన్నాళ్లుగా కలిప్స్ జీవిస్తున్నారు. ఈ జంట వారి బంధాన్ని అధికారికంగానే ప్రకటించి అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. రేపు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మెయిన్ లీడ్ లో కన్నడ – తెలుగు భాషల్లో కొత్త సినిమాని ప్రకటించారు.(Naresh)

నరేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న శుభకృత్ నామ సంవత్సరం అనే కొత్త సినిమాని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నరేష్ – పవిత్ర జంటగా హాజరయ్యారు.

Also See : Nayanthara Trisha : దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార, త్రిష.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోయిన్స్..

ఈ ఈవెంట్లో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో 54 ఏళ్ళు ఆయనకు. అలాంటి ఒక ఆర్టిస్ట్ తో నా జీవితం గడపడం అనేది నా అదృష్టం, దేవుడి బ్లెస్సింగ్ అది. ఆయన ప్రతి పాత్రకు ఒకేలా చాలా ప్రిపేర్ అయి కష్టపడతారు. నేను ఆయనతో మాట్లాడాలంటే టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన అంత బిజీగా ఉన్నారు. రోజు మొత్తంలో నాకు ఒక అరగంట దొరుకుతుందేమో ఆయనతో మాట్లాడటానికి. ఇంత పెద్ద నటుడితో కలిసి జీవిస్తున్నాను అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను.

హ్యాపీ బర్త్ డే మీకు. నాతో మీరు మరింత మంచి లైఫ్ మీరు గడపాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు మరిన్ని మంచి సినిమాలు చేయాలి. ఆయన ఒక రాజులా బతుకుతాడు. ప్రతి క్షణం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే బతుకుతారు. నేను కన్నడ అమ్మాయిని. కన్నడ ప్రొడ్యూసర్ ఇక్కడ తెలుగులో ఈయనతో సినిమా చేస్తున్నారు. కన్నడ, తెలుగులో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను తెలుగులో బాగా మాట్లాడటానికి నరేష్ గారే కారణం అని చెప్పడంతో పవిత్ర మాటలకు నరేష్ ఎమోషనల్ అయి ఆమెను దగ్గరికి తీసుకున్నారు.

Also See : Sobhita Dhulipala : ‘చీకటిలో’ ప్రమోషన్స్ తో బిజీబిజీగా శోభిత ధూళిపాళ.. సింపుల్ లుక్స్ లో ఫొటోలు వైరల్..

ఇక నరేష్ ఈ ఈవెంట్లో పవిత్ర గురించి మాట్లాడుతూ.. నాలో సగం పవిత్ర, నా లక్కీ చామ్ తను అని తెలిపారు.