Alappuzha Gymkhana : మలయాళం సూపర్ హిట్ కామెడీ బాక్సింగ్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో..

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమాగా తెరకెక్కిన అలప్పుజ జింఖానా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Naslen Malayalam Boxing Comedy Alappuzha Gymkhana Movie OTT Streaming Details

Alappuzha Gymkhana : ప్రేమలు ఫేమ్ నస్లేన్, లక్మన్ అవరన్, గణపతి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, అనఘ రవి.. పలువురు కీలక పాత్రల్లో ఖలీద్ రెహమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళం సినిమా ‘అలప్పుజ జింఖానా’. మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజయి భారీ విజయం సాధించి 50 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 25న తెలుగులో కూడా థియేట్రికల్ రిలీజ్ అయి మంచి విజయమే సాధించింది.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమాగా తెరకెక్కిన అలప్పుజ జింఖానా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అలప్పుజ జింఖానా సినిమా సోనీ లివ్‌ ఓటీటీలో జూన్‌13 నుంచి తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోనీ లివ్ ఓటీటీ అధికారికంగా ప్రకటిచారు.

Also Read : Manchu Vishnu : మీ దగ్గర్నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు.. నార్త్ వాళ్లకు కౌంటర్ ఇచ్చిన విష్ణు.. కన్నప్ప బిజినెస్ గురించి కామెంట్స్..

అలప్పుజ జింఖానా కథ విషయానికొస్తే.. జోజు(నస్లేన్) అతని ఫ్రెండ్స్ ఇంటర్ ఫెయిల్ అవుతారు. అదే సమయంలో జోజు ఫ్రెండ్ ఓ అమ్మాయిని ట్రై చేస్తుంటే ఒక బాక్సర్ వచ్చి కొడతాడు. దీంతో వీళ్లు స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో సీట్ తెచ్చుకోడానికి, ఎవరైనా వస్తే కొట్టడానికి అన్నట్టు బాక్సర్స్ అవ్వాలని ఫిక్స్ అవుతారు. జోజు, అతని ఫ్రెండ్స్ అలప్పుజ జిల్లాలోని జింఖానా అనే బాక్సింగ్ సెంటర్ లో జాయిన్ అవుతారు. వీళ్లంతా బాక్సింగ్ ని సీరియస్ గా తీసుకోకుండా కామెడీగా తీసుకొని నెట్టుకొస్తారు. జిల్లా పోటీల్లో ఏదో ఒకటి చేసేసి గెలవడంతో వీళ్లంతా కేరళ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కి సెలెక్ట్ అవుతారు. వీళ్ళతో పాటు సిన్సియర్ గా బాక్సింగ్ ఆడే దీపక్(గణపతి), వీళ్లకు కోచ్ గా నేషనల్ లెవల్ బాక్సర్ జోషువా(లక్మన్) వస్తారు. జోజు, అతని ఫ్రెండ్స్ కేరళ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలుస్తారా? ఆ ఛాంపియన్ షిప్ కోసం వెళ్లి అక్కడ ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తారు తెలియాలంటే ఓటీటీలో చూసేయండి..

Also Read : Arjun Das – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో అర్జున్ దాస్.. OG షూట్ గ్యాప్ లో ఫొటోలు..