నటసార్వభౌమ ట్రైలర్

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన నటసార్వభౌమ ట్రైలర్ రిలీజ్.

  • Publish Date - January 25, 2019 / 11:23 AM IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన నటసార్వభౌమ ట్రైలర్ రిలీజ్.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, అనుపమ పరమేశ్వరన్, రచితా రామ్ హీరో, హీరోయిన్స్‌గా, పవన్ వడయార్ డైరెక్షన్‌లో, ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా, నటసార్వభౌమ. రీసెంట్‌గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ అంతా యాక్షన్‌తో నిండిపోయింది. పునీత్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా కనిపిస్తున్నాడు. నటసార్వభౌమ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఫిబ్రవరి 7న నటసార్వభౌమ కన్నడ నాట భారీగా రిలీజ్ కానుంది. సీనియర్ నటి, బి.సరోజా దేవి, రవి శంకర్, చిక్కన్న, శ్రీనివాస మూర్తి, సాధు కోకిల తదితరులు నటిస్తున్నఈ సినిమాకి కెమెరా : వైద్య.ఎస్, సంగీతం : డి.ఇమాన్, ఎడిటింగ్ : మహేష్ రెడ్డి, ఆర్ట్ : ఎస్.భూపతి, ఫైట్స్ : పీటర్ హెయిన్

వాచ్ నటసార్వభౌమ ట్రైలర్..