Site icon 10TV Telugu

PVNS Rohit : మొన్నే నేషనల్ అవార్డు గెలుచుకున్న సింగర్.. తాజాగా ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం..

National Award Winner Singer PVNS Rohit Engaged with his Girl Friend

PVNS Rohit

PVNS Rohit : ఇటీవల సింగర్ PVNS రోహిత్ నేషనల్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 71వ నేషనల్ అవార్డుల్లో బేబీ సినిమాలో ప్రేమిస్తున్నా.. సాంగ్ కి బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డుని రోహిత్ గెలుచుకున్నాడు. దీంతో అందరూ అతనికి అభినందనలు తెలియచేసారు.

Also Read : Mayasabha : ‘మయసభ’ సిరీస్ రివ్యూ.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల స్నేహంపై వెబ్ సిరీస్..

ఇలాంటి సంతోషకర సమయంలో రోహిత్ మరో శుభవార్త చెప్పాడు. సింగర్ రోహిత్ తను ప్రేమించిన అమ్మాయి డాక్టర్ శ్రేయను నిశ్చితార్థం చేసుకున్నాడు. శ్రేయతో నిశ్చితార్థం అయిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా లక్కీ గర్ల్ ని నిశ్చితార్థం చేసుకున్నాను అని తెలిపాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు రోహిత్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.

Exit mobile version