ఏబీసీడీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి నాని గెస్ట్
మే 13వ తేదీ సాయంత్రం ఆరు గంటలనుండి హైదరాబాద్, ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఏబీసీడీ మూవీ ప్రీ-రీలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు..

మే 13వ తేదీ సాయంత్రం ఆరు గంటలనుండి హైదరాబాద్, ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఏబీసీడీ మూవీ ప్రీ-రీలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు..
శ్రీరస్తు శుభమస్తు, ఒక్కక్షణం సినిమలతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న అల్లు శిరీష్, కృష్ణార్జునయుద్థం ఫేం రుక్సార్ థిల్లాన్ జంటగా.. ప్రముఖ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, పెళ్ళి చూపులు ఫేమ్, యష్ రంగినేని నిర్మాణంలో, డి.సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కిన మూవీ.. ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ).. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఎబిసీడీ సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఏర్పాట్లు చేస్తుంది మూవీ టీమ్.
మే 13వ తేదీ సాయంత్రం ఆరు గంటలనుండి హైదరాబాద్, ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఏబీసీడీ మూవీ ప్రీ-రీలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఫంక్షన్‌కి గెస్ట్‌గా వస్తున్నందుకు నానికి ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ తెలిపాడు అల్లు శిరీష్. మే 17 న ఏబీసీడీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : జుదా శాండీ, కెమెరా : రామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : వర్మ, కొరియోగ్రఫీ : విజయ్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని.