Navdeep : పెళ్లి చేసుకోవట్లేదని.. పెళ్లి కార్డుపై సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్న నవదీప్..

త్వరలో నవదీప్ హీరోగా ఓ సినిమాతో రాబోతున్నాడు.

Navdeep New Movie Release Date Announcing with Wedding Card

Navdeep : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నవదీప్ ఒకరు. జై సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఆ తర్వాత హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. 2021లో మోసగాళ్లు సినిమాలో ఓ క్యారెక్టర్ తో పలకరించిన నవదీప్ అప్పట్నుంచి సినిమాలకు దూరంగా ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు పలు సిరీస్ లు మాత్రం చేస్తున్నాడు.

త్వరలో నవదీప్ హీరోగా ఓ సినిమాతో రాబోతున్నాడు. ‘లవ్ మౌళి'(Love Mouli) అనే సినిమాతో నవదీప్ తన కొత్త వర్షన్ చూపిస్తా అంటూ వస్తున్నాడు. ఇప్పటికే లవ్ మౌళి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచాడు. ఏదో బోల్డ్ కంటెంట్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నవదీప్ ని పెళ్లి గురించి అడిగితే మాత్రం నో పెళ్లి అంటాడు. కానీ లవ్ మౌళి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మాత్రం పెళ్లి కార్డుతో రివీల్ చేయడం గమనార్హం.

Also Read : Vikrant Massey : కొడుకు పేరు, పుట్టిన డేట్‌ని చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న హీరో..

తాజాగా నవదీప్ ఓ వీడియో రిలీజ్ చేసాడు. ఈ వీడియోలో అప్డేట్ అంటూ.. పసుపు రాసిన ఓ చిన్న చెక్కేపెట్టె ఓపెన్ చేసి అందులో పెళ్లి కార్డు చూపించి దాంట్లో పెళ్లి కార్డులో ఉండే మ్యాటర్ రూపంలో తన లవ్ మౌళి సినిమా గురించి రాసి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు. లవ్ మౌళి సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించాడు. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే అసలు పెళ్లి కాన్సెప్ట్ అంటేనే పడని నవదీప్ ఇలా తన నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ని పెళ్లి కార్డుతో చేయడం గమనార్హం. దీంతో పెళ్లి ఎలాగో చేసుకోవట్లేదని ఇలా పెళ్లి కార్డుతో ప్రమోషన్స్ చేసుకుంటున్నావా అని సరదాగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.