Naveen Chandra : ‘గేమ్ ఛేంజర్’ పై ఇప్పుడున్నది అసలు హైపే కాదు.. నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా గేమ్ ఛేంజర్ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Naveen Chandra Interesting Comments on Game Changer Movie

Naveen Chandra : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. మూడేళ్ళుగా ఎలాంటి అప్డేట్స్ లేకుండా ఇటీవలే వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది.

Also Read : Raja saab : ‘రాజా సాబ్’ నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్‌.. స్టైలిష్‌గా ప్ర‌భాస్‌.. గళ్ళ చొక్కా, టీ షర్ట్, నల్ల ఫ్యాంటు..

అయితే తాజాగా గేమ్ ఛేంజర్ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ పై ఇప్పుడున్నది అసలు హైపే కాదు త్వరలో మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పటి నుండి జనవరి వరకు వెయిట్ చెయ్యండి, సరికొత్త అప్డేట్స్ వస్తాయి. దీపావళికి టీజర్ కూడా రాబోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత దిల్ రాజు గారు ఇచ్చే అప్డేట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అంటూ అంచనాలు పెంచేసాడు నవీన్ చంద్ర.

ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి జనవరి 10న ఈ సినిమా భారీగా రిలిజ్ కాబోతుంది. ఈ సినిమాలో SJ సూర్య విలన్ గా, సునీల్, శ్రీకాంత్, కియారా అద్వానీ, అంజలి, విశ్వంత్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.