Naveen Chandra Kamakshi Bhaskarla New Movie Show Time Announced
Naveen Chandra : నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా ఉగాది నాడు కొత్త సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ బ్యానర్ పై మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘షో టైమ్’. ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు.
నిన్న ఉగాది పండుగ నాడు షో టైమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కోణంలో కనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉండనుంది ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది షో టైమ్.
పొలిమేర సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల ఇప్పుడు షో టైమ్, 12A రైల్వే కాలనీ, పొలిమేర 3.. ఇలా వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ఇక నవీన్ చంద్ర ఓ పక్క సినిమాలు, మరో పక్క సిరీస్ లతో బిజీగా ఉన్నాడు.