Naveen Polishetty Anaganaga Oka Raju movie collected 41 crore gross in just two days.
Anaganaga Oka Raju Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్ పాజిటీవ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Navya Swamy: ఇంటి ముంగిట ముగ్గులతో ముద్దుగుమ్మలా.. నవ్య స్వామి సంక్రాంతి ఫోటోలు
దీంతో కలెక్షన్స్(Anaganaga Oka Raju Collection) కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ సినిమా. మొదటి రోజు ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక రెండో రోజు మొదటిరోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. రెండు రోజులు కలుపుకొని ఏకంగా రూ.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనగనగా ఒక రాజు మూవీ. ఇక సినిమా విషయానికి వస్తే, స్టార్ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ గా నవీన్ తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. ప్రతీ సీన్ లో తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఫుల్లుగా నవ్వించాడు.
జాతి రత్నాలు సినిమాకు పూర్తి ఆపోజిట్ పాత్రలో కనిపించి తన లోని వేరియేషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇక మీనాక్షి కూడా తన అందంతో, క్యూట్ నటనతో బాగానే ఆకట్టుకుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమా కథ విషయంలో నవీన్ కి కూడా భాగం ఉంది. తాను బేసిక్ గా రైటర్ కావడం అనేది అతని సినిమాలకు బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమాకు కూడా చాలా హెల్ప్ అయ్యింది. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమాకు ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని మేకర్స్ ఆషాభావం వ్యక్తం చేస్తున్నారు.
Naveen Polishetty Anaganaga Oka Raju movie collected 41 crore gross in just two days.