×
Ad

Anaganaga Oka Raju : నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడుగా.. ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ డే కలెక్షన్స్..

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. (Anaganaga Oka Raju)

Anaganaga Oka Raju

Anaganaga Oka Raju : వరుసగా హిట్స్ కొడుతున్న నవీన్‌ పొలిశెట్టి ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో వచ్చాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో పై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.(Anaganaga Oka Raju)

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 22 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అనగనగా ఒక రాజు సినిమా వరల్డ్ వైడ్ దాదాపు 30 కోట్ల థియేటరికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం.

Also Read : Akkineni Family : అక్కినేని ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ గ్రూప్ ఫొటోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా..?

దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 60 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇంకా పండగ సెలవులు నాలుగు రోజులు ఉండటం, సినిమా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటున్నారు. అనగనగా ఒక రాజు సినిమా ఓవరాల్ వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని మూవీ యూనిట్ అంచనా వేస్తున్నారు.

Also See : Akkineni Family Sankranthi : నాగచైతన్య – శోభిత సంక్రాంతి సెలబ్రేషన్స్.. అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులతో అక్కినేని ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..