Naveen Polishetty : సెట్స్ లోకి రాగానే అనుష్క అందరికి ఒక వెచ్చటి హాగ్ ఇస్తుంది.. నవీన్ పోలిశెట్టి కామెంట్స్..

నవీన్ పోలిశెట్టి అనుష్కపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాంకర్.. స్టార్ హీరోయిన్ అనుష్కతో కలిసి నటించారు కదా ఆమె దగ్గరి నుంచి ఏం నేర్చుకున్నారు అని అడగగా నవీన్ పోలిశెట్టి సమాధానమిస్తూ..

Naveen Polishetty : సెట్స్ లోకి రాగానే అనుష్క అందరికి ఒక వెచ్చటి హాగ్ ఇస్తుంది.. నవీన్ పోలిశెట్టి కామెంట్స్..

Naveen Polishetty interesting comments on Anushka Shetty in Miss Shetty Mr Polishetty Promotions

Updated On : August 23, 2023 / 2:00 PM IST

Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి అనుష్క(Anushka)తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించింది. సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Mr Pregnant : చిన్న సినిమా.. పెద్ద హిట్.. నాలుగు రోజుల్లోనే 5 కోట్లు కలెక్ట్ చేసిన మిస్టర్ ప్రగ్నెంట్..

తాజాగా నవీన్ పోలిశెట్టి అనుష్కపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాంకర్.. స్టార్ హీరోయిన్ అనుష్కతో కలిసి నటించారు కదా ఆమె దగ్గరి నుంచి ఏం నేర్చుకున్నారు అని అడగగా నవీన్ పోలిశెట్టి సమాధానమిస్తూ.. సెట్స్ లో అడుగు పెట్టగానే అనుష్క టెక్నీషియన్స్, అందరికి ఒక వెచ్చటి హాగ్ ఇస్తుంది. కానీ అది అభిమానపూర్వకంగా మాత్రమే ఇచ్చే కౌగిలింత. ఆవిడ నుంచి నేను అలా అందరికి హాగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. అది మనలో ఎంతో పాజిటివిటిని ఇస్తుంది. చుట్టూ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్ లో ఇదొకటి అని తెలిపాడు. దీంతో నవీన్ చేసే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.