Kaathu Vaakula Rendu Kadhal
Kaathu Vaakula Rendu Kadhal: ఒకరితో రిలేషన్ లో ఉన్నాడు, మరొకర్ని పెళ్లి చేసుకున్నాడు. అదేంటని అడిగితే ఇద్దరూ కావాలంటున్నాడు విజయ్ సేతుపతి. మరి ఆ ఇద్దరూ ఊరికే ఉంటారా..? ఇద్దరిలో ఎవరుకావాలో తేల్చుకోమంటూ చుక్కలు చూపిస్తున్నారు. మరి ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ ఎలా సాల్వ్ చేశారో మనం కూడా చూద్దాం.
Nayan Vignesh: సరోగసీతో తల్లి కాబోతున్న నయన్.. క్లారిటీ ఇదే
నారి నారి నడుమ మురారి.. ఇదే సక్సెస్ గ్యారంటీ సబ్జెక్ట్ తో విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో ధియేటర్లోకొస్తున్నారు నయనతార, సమంత, విజయ్. అసలు ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచే ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ కణ్మణి కతీజా రాంబో మూవీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఇంకా హైప్ తీసుకొచ్చింది. ఈ ఇంట్రస్టింగ్ మూవీ ఏప్రిల్ 28న ధియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
Vijay Sethupathi : విజయ్ సేతుపతి అంకిత భావం.. క్యాలెండర్ పై ఫోటోల కోసం మేకప్‌కి 45 నిమిషాలు..
డివోర్స్ అయిన తర్వాత సమంత, ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత నయనతార, ఉప్పెన లాంటి క్రూయల్ విలన్ రోల్ తర్వాత విజయ్ సేతుపతి.. చేస్తున్న కామెడీ జానర్ మూవీ కణ్మణి రాంబో కతీజా. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీని విఘ్నేష్ శివన్ అంతే ఎంటర్ టైనింగ్ గా స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు. కణ్మణి, కతీజా రాంబో మూవీలో నయన్ కాస్త హోమ్లీగా కనిపిస్తే.. సమంత మాత్రం కాస్త బోల్డ్ గా గ్లామరస్ గా కనిపిస్తోంది.
Samantha : నా దయాగుణాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దు.. సమంత సీరియస్ పోస్ట్..
విజయ్ సేతుపతి, నయనతార, విఘ్నేశ్ కాంబినేషన్లో ఇంతకుముందొచ్చిన నానుము రౌడీదాన్ సినిమా సూపర్ క్యూట్ లవ్ స్టోరీగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీలో సమంతను యాడ్ చేసి కాస్త గ్లామర్ ని యాడ్ చేశారు టీమ్. అంతేకాదు ఈ సినిమాలో బాహబలి లాంటి సీరియస్ మూవీని కూడా చూపించారు. ఒకరిని పెళ్లి చేసుకుని, మరొకరితో రిలేషన్ లో ఉండి.. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో డిసైడ్ చేస్కోడానికి విజయ్ సేతుపతి పడే తిప్పల్ని.. ఆడియన్స్ కి కంప్లీట్ కామెడీ జానర్ లో ప్రజెంట్ చేస్తున్నారు విఘ్నేశ్.