న్యూస్ రీడర్ నయనతార – ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

లేడీ సూపర్‌స్టార్ నయనతార కెరీర్ ఆరంభంలో తన మాతృభాష మలయాళంలో న్యూస్ రీడర్‌గా పనిచేసింది.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

  • Publish Date - November 26, 2019 / 09:10 AM IST

లేడీ సూపర్‌స్టార్ నయనతార కెరీర్ ఆరంభంలో తన మాతృభాష మలయాళంలో న్యూస్ రీడర్‌గా పనిచేసింది.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

సెలబ్రెటీల పర్సనల్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయి. అరుదైన ఫోటోలైతే రకరకాల కథనాలు ప్రసారవుతుంటాయి. ఇక హీరోయిన్ల పిక్స్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. కెరీర్ తొలినాళ్లలో లేడీ సూపర్‌స్టార్ నయనతారకు సంబంధించిన పిక్ ఒకటి తాజాగా బయటకొచ్చింది. కెరీర్ ఆరంభంలో నయనతార తన మాతృభాష మలయాళంలో న్యూస్ రీడర్‌గా పనిచేసింది.

 

మలయాళంలో చేసిన తొలి సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో టీవీ యాంకర్‌గా, న్యూస్ రీడర్‌గా కూడా పనిచేసిందామె. నయన్ అసలు పేరు డయానా మరియన్ కురియం..
అప్పటి వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను చూసి అందులో ఉన్నది నయనతార అని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

 

మలయాళంలో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమపై నయన్ దృష్టి పెట్టి, `చంద్రముఖి`, `గజినీ` వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుని తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసింది. అగ్రహీరోలతో పాటు కుర్ర హీరోలతోనూ రొమాన్స్ చేసిన డయానా అక్కడినుంచి నయనతారగా ఎదిగి లేడీ సూపర్‌స్టార్‌గా స్థిరపడింది. నయనతార సూపర్‌‌స్టార్ రజినీకాంత్ సరసన నటించిన ‘దర్బార్’ 2020 జనవరి 9న విడుదల కానుంది.