Nayanthara Properties and Business Investments Details
Nayanthara : సినిమా సెలబ్రిటీలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటారు. ఫేమ్ రాగానే డబ్బులు బాగా సంపాదించేసి పెట్టుబడులు పెట్టేస్తారు, ఆస్తులు కొనుక్కుంటారు, యాడ్స్ చేసి మరింత డబ్బులు సంపాదిస్తారు. చాలామంది సెలబ్రిటీల ఆస్తులు చూస్తే మాములు జనాలకు కళ్ళు తిరగాల్సిందే. తాజాగా నయనతార ఆస్తులు వైరల్ గా మారాయి. మ్యాజిక్ బ్రిక్స్ అనే కంపెనీ ఇటీవల నయనతార ఆస్తులు, ఆమె పెట్టిన పెట్టుబడుల వివరాలు బయటపెట్టింది.
ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతార ఇప్పుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే నెమ్మదిగా సినిమాలు కూడా చేస్తుంది. మరోవైపు పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టింది.
నయనతార స్థిరాస్తుల విలువే 100 కోట్ల విలువ చేస్తాయట. చెన్నైలోని ఖరీదైన ఏరియా పోయెస్ గార్డెన్ లో పెద్ద ఇంట్లో ఉంటుంది నయనతార. ఈ భారీ నివాసంతో పాటు హైదరాబాద్, దుబాయ్ లో కూడా నయనతారకు స్థిరాస్థులు ఉన్నాయట. అలాగే తన పేరెంట్స్ కి సొంతూళ్లో ఒక ఖరీదైన ఇల్లు బహుమతిగా ఇచ్చింది. ఇలా నయనతారకు ఉన్న స్థిరాస్తుల విలువే 100 కోట్ల ఉంటుందని సమాచారం.
నయనతార ఓ మహిళా డాక్టర్ తో కలిసి 9 స్కిన్, ఫెమి 9 అనే సౌందర్య సాధనాల ఉత్పత్తులు చేసే కంపెనీలను ప్రారంభించింది. కాస్మొటిక్ రంగంలో ఈ రెండిటికి ఇప్పుడు మంచి బ్రాండ్ వ్యాల్యూ ఉంది. వీటికి నయనతారనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. భర్త విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాతగా సినిమాలు కూడా నిర్మిస్తుంది. అలాగే చెన్నైలోని ఓ టీ చెయిన్ రెస్టారెంట్ లో కూడా పెట్టుబడులు పెట్టింది. కొంత డబ్బు చెన్నైలోని రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టిందట. నయనతార ఓ 100 కోట్ల రూపాయలు దుబాయ్ లోని ఓ చమురు కంపెనీలో పెట్టుబడి పెట్టిందని ఓ రూమర్ ఉంది.
Also Read : NTR : అప్పుడే ప్రిపేర్ అయిపోతున్న ఎన్టీఆర్.. చేతిలో ఉన్న బుక్ ఏంటో తెలుసా?
ఇక నయనతారకు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్, ఫోర్డ్, టయాటోలకు చెందిన పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమెకు ప్రైవేట్ జెట్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో నయనతారే ఎక్కువ సంపాదించి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుందని, ఒకవేళ సినిమాలకు కొన్నాళ్ల తర్వాత స్వస్తి చెప్పినా వ్యాపారాలతోనే నయన్ బాగా సంపాదిస్తుందని తెలుస్తుంది.