Nayanthara Shocking Decision Of Doing Movies With Ajith
Nayanthara: సౌత్ స్టార్ బ్యూటీ నయనతార ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తమిళ, తెలుగు భాషలతో పాటు ప్రస్తుతం హిందీలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ స్టార్ బ్యూటీ. ఇక నయన్ తమిళంలో సినిమాలు ఎవరితో చేయాలనే విషయంపై తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Nayanthara : నయన్ దంపతులు చేసిన పనికి.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజెన్లు!
తమిళ స్టార్ హీరో అజిత్ 62వ చిత్రాన్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. ఈ మేరకు సినిమా పనులు కూడా మొదలయ్యాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను మరో డైరెక్టర్ చేతికి అప్పగించారు. దీంతో విఘ్నేష్ శివన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అయితే, ఈ పరిణామంతో స్టార్ హీరోయిన్ నయనతార కూడా చాలా తీవ్రంగా కోపానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Nayanthara : ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి అంటున్న నయనతార..
అందుకే ఆమె భవిష్యత్తులో అజిత్‌తో సినిమాలు చేసేందుకు ఏమాత్రం ఆసక్తిని చూపడం లేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గతంలో అజిత్‌తో కలిసి బిల్లా, ఈగన్, ఆరంభం, విశ్వాసం వంటి సినిమాల్లో నటించగా, అవి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. మరి నిజంగానే నయన్ రాబోయే రోజుల్లో అజిత్‌తో కలిసి సినిమా చేస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.