Nayanthara: డాక్యుమెంటరీగా నయన్-విఘ్నష్‌ల పెళ్లి.. అదిరిపోవాల్సిందే అంటోన్న ఫ్యాన్స్!
కోలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన స్టార్ బ్యూటీ నయనతార, విఘ్నేష్ శివన్‌లు జూన్ 9న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా నయన్-విఘ్నేష్‌ల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీగా స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
- Anil Aaleti
- Published On : July 21, 2022 / 11:43 AM IST
Nayanthara Vignesh Shivan Wedding As Documentary In Netflix
Nayanthara: కోలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన స్టార్ బ్యూటీ నయనతార, విఘ్నేష్ శివన్‌లు జూన్ 9న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట గతకొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతూ వచ్చి, ఎట్టకేలకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. జూన్ 9న మహాబలిపురంలో వీరి వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే ఇప్పటివరకు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వీరి వివాహానికి సంబంధించి ఎలాంటి వీడియో కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు.
Nayanthara: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..!
అయితే తాజాగా నయన్-విఘ్నేష్‌ల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీగా స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, రౌడీ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేష్‌ల ప్రేమ ప్రయాణం, అక్కడి నుండి వారి పెళ్లి వరకు చోటు చేసుకున్న పరిణామాలను ప్రేక్షకులకు చూపించబోతున్నట్లుగా దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చాడు.
Nayanthara – Vignesh: క్షమాపణలు చెప్పిన కొత్త జంట నయనతార- విఘ్నేశ్
ఇక ఈ డాక్యుమెంటరీ కోసం తాము ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నామని సోషల్ మీడియాలో నయనతార అభిమానులు పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లుగా తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిసతున్న గాడ్‌ఫాదర్, షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ చిత్రాల్లో నటిస్తోంది.
