×
Ad

Special Song : OG స్పెషల్ సాంగ్ యాడ్ చేసార్రోయ్.. నేహాశెట్టి కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్..

తాజాగా స్పెషల్ సాంగ్ ని OG సినిమాలో యాడ్ చేశామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. (Special Song)

Special Song

Special Song : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఇటీవల సెప్టెంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 270 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు, టాలీవుడ్ జనాలకు కూడా ఈ సినిమా బాగా నచ్చేసింది. ఇక పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.(Special Song)

అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, అందులో నేహశెట్టి డ్యాన్స్ చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. నేహశెట్టి కూడా ఓ ఈవెంట్లో ఈ విషయం చెప్పింది. కానీ సినిమాలో సాంగ్ ప్లేస్మెంట్ లేదని ఆ సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేసారు. అయితే అందరూ స్పెషల్ సాంగ్ ని అడుగుతుండటంతో సోమవారం నుంచి యాడ్ చేస్తామని మూవీ యూనిట్ చెప్పారు.

Also See : Priyanka Mohan : ఓజీ – కన్మణి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక మోహన్.. ఈ ఫొటోలు చూశారా?

తాజాగా స్పెషల్ సాంగ్ ని OG సినిమాలో యాడ్ చేశామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్.. అనే స్పెషల్ సాంగ్ ని నేడు సాయంత్రం షోల నుంచి యాడ్ చేసినట్టు తెలుపుతూ అధికారికంగా ప్రకటించారు. నేహశెట్టి ఉన్న ఒక స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

దీంతో ఈ సాంగ్ సినిమాలో ఎక్కడ పెట్టారో అని మరోసారి సినిమా చూడటానికి రెడీ అవుతున్నారు పవన్, నేహా ఫ్యాన్స్. కొంతమంది కనీసం లిరికల్ వీడియో లేదా ప్రోమో అయినా రిలీజ్ చేయమని అడుగుతున్నారు. మరి సినిమాలో కాకుండా ఈ సాంగ్ ని బయట ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.


Also Read : OG Success Meet : దసరా స్పెషల్.. OG సక్సెస్ మీట్.. పవర్ స్టార్ కూడా.. ఫ్యాన్స్ కి పండగే..