Neha Shetty
Neha Shetty : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక సినిమాలో పవన్ ని చాలా కొత్తగా, స్టైలిష్ గా, పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా చూపించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి.
అయితే OG రిలీజ్ కి ముందు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ లో హీరోయిన్ నేహశెట్టి పెర్ఫార్మ్ చేసిందని వార్తలు వచ్చాయి. నేహా శెట్టి కూడా ఓ ఈవెంట్లో OG సినిమాలో ఉన్నాను అనే తెలిపింది. దీంతో మంచి స్పెషల్ సాంగ్ ఉంటుందని భావించారు. తీరా సినిమా చూస్తే నేహాశెట్టి సాంగ్ లేదు. దీంతో ఆ సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేసారేమో అని భావిస్తున్నారు.
Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..
సినిమా చూస్తే ఎక్కడా స్పెషల్ సాంగ్ కి స్కోప్ లేదు. అందుకే ఎడిటింగ్ లో తీసేసారు అని అనుకుంటున్నారు. నేహశెట్టి స్వయంగా చెప్పిందంటే కచ్చితంగా స్పెషల్ సాంగ్ షూట్ చేసే ఉంటారని తెలుస్తుంది. మరి ఆ సాంగ్ తర్వాత ఓటీటీలో కానీ, విడిగా యూట్యూబ్ లో గాని రిలీజ్ చేస్తారా చూడాలి.