Netizens Comments Goes Viral On Salman Khan Dance In Naiyo Lagda Song
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సల్మాన్ నయా లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.
Shahrukh Khan – Salman Khan : షారుఖ్ అయిపోయింది.. నెక్స్ట్ సల్మాన్..?
కాగా, తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాలోని ఓ సాంగ్‌లో సల్మాన్ వేసిన డ్యాన్స్ స్టెప్ నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగానే సల్మాన్ ఖాన్ సినిమాల్లో హెవీ డ్యాన్స్ మూమెంట్స్ కనిపించవు. ఇక ఈ హీరో చేసే డ్యాన్స్ స్టెప్స్‌లో కొన్ని మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కానీ, తాజాగా రిలీజ్ అయిన ‘నయ్యో లగ్దా’ సాంగ్‌లో సల్మాన్ చేసిన డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో సల్మాన్ ఖాన్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఏమాత్రం బాగోలేవని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.
ఇక నెటిజన్లు ఈ డ్యాన్స్ స్టెప్పులపై తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. పిల్లలకు పీఈటీ చెప్పినట్లుగా ఆ స్టెప్పులు ఏమిటని కొందరు అంటుంటే, సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి డ్యాన్స్ కంపోజ్ చేసే వారిని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏదేమైనా సల్మాన్ డ్యాన్స్ మరోసారి ట్రోలింగ్‌కు కారణం కావడంతో, ఇకనైనా ఆయన మంచి స్టెప్పులు వేస్తూ చూడాలని ఉందంటున్నారు పలువురు అభిమానులు.
Lagta hai choreographer ki jagah school PT teacher ko bulaya tha ?#NaiyoLagda pic.twitter.com/Jmm8KD7jIv
— རིསམའཔ. (@iThunderstormx) February 12, 2023