Neha Kakkar పెళ్లి డ్రెస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

  • Publish Date - October 30, 2020 / 01:07 PM IST

Neha Kakkar Wedding Dress: పాపులర్ బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్, గాయకుడు Rohanpreet Singh ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా వీళ్ల పెళ్లి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే నేహా డ్రెస్సింగ్, స్టైల్ విషయంలో అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాలను కొట్టిందని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

రెడ్ కలర్ లెహంగా ధరించి ఉన్న ఫొటోను నేహా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రియాంక చోప్రా కూడా తన పెళ్లి అప్పుడు అచ్చు ఇలాంటి డ్రెస్సే వేసుకుందని.. అలాగే నేహా, రోహన్ క్రీమ్ కలర్ వెడ్డింగ్ డ్రెస్ చూస్తుంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లి గుర్తొస్తుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మ్యారేజ్ తర్వాత నేహా కక్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన పేరు మార్చింది.