Samantha
Samantha : స్టార్ హీరోయిన్ సమంత చైతూతో విడాకుల అనంతరం మరింత బిజీ అయింది. ఓ పక్క వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయింది. ఇప్పటికే సమంత చేతిలో దాదాపు అరడజను సినిమాలకి పైగానే ఉన్నాయి. వాటిలో తెలుగు, తమిళ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా వెబ్ సిరీస్ లకి కూడా ఓకే చెప్పింది. ఇలా వరుస ప్రాజెక్టులకి ఓకే చెప్తూ బిజీ బిజీగా ఉంది. ఇక కెరీర్ బిజీ చేసుకునే పనితో పాటు డబ్బులు కూడా బాగానే సంపాదించాలని ఫిక్స్ అయింది సమంత.
ఇప్పటికే సినిమాల్లో తన రెమ్యునరేషన్ పెంచేసింది. ఇవి కాకుండా తన బిజినెస్ లని ప్రమోట్ చేస్తూ మరి కొన్ని బిజినెస్ లలో పెట్టుబడులు కూడా పెట్టింది సమంత. ఇక ఇప్పటికే పలు కమర్షియల్ యాడ్స్ తో అనుసంధానమై ఉన్న సమంత తాజాగా మరో కమర్షియల్ యాడ్ కి కూడా ప్రచారకర్తగా మారింది. సమంత చేతిలో ఇప్పటికే పలు యాడ్స్ ఉండగా తాజాగా ‘ఫాంటా’ అనే ఆపిల్ జ్యూస్‌కు సామ్ ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది.
Green India Challenge : నాకు పచ్చదనం, మట్టి నచ్చదు అంటూనే చెట్లు నాటిన ఆర్జీవీ
ఇప్పటికే ఫాంటా డ్రింక్ మార్కెట్ లో ఉండగా అందులో యాపిల్ వేరియేషన్ తో కొత్త డ్రింక్ ని తీసుకొచ్చింది. ఈ కొత్త డ్రింక్ కి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. దానికి సంబంధించిన ఫోటోలని, వీడియోల్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.