casting couchలో కొత్త యాంగిల్ చెప్పిన తేజశ్వి

  • Publish Date - June 12, 2020 / 04:44 PM IST

తెలుగమ్మాయి తేజశ్వి మడివాడ క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్తూ కొత్త నిర్వచనం చెప్తుంది. ఇండస్ట్రీతో లింకులు ఉన్న వాళ్లు కూడా పరోక్షంగా నీచమైన ప్రపోజల్స్ కు దిగుతుంటారని చెప్పింది. ఇంకా ఈ క్యాస్టింగ్ కౌచ్ కు క్యాండీ అనే పేరు పెట్టి వివరించింది. డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు హీరోయిన్లు అవుదామని వచ్చిన వాళ్లకు ఇలా క్యాండీ ఆఫర్ చేస్తారట.

‘సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి స్త్రీ దాహం ఉంటుంది. వీరంతా ఈ క్యాండీ ప్రోసెస్ నే ఫాలో అవుతారు. సెక్సువల్ ఫేవర్స్ తీర్చుకోవడానికి మాట్లాడటం, డేటింగ్, పెళ్లి చేసుకోవడం లాంటివి వదిలేసి డైరక్ట్ గా ఇందులోకి దిగిపోతారు. ఆడాళ్లతో మాట్లాడే ధైర్యం కూడా లేని వాళ్లు, వాళ్లతో డేటింగ్ చేసే దమ్ము లేని వాళ్లు కూడా వీటికి రెడీగా ఉంటారు. 

ఈ క్యాండీని వాడుకుని సెక్సువల్ ఫేవర్స్ తీర్చుకునేందుకు సిద్ధమైపోతుంటారని చెప్పింది. అయితే ఇదే సందర్భంగా ఈ క్యాండీ తన జీవితాన్ని మార్చేసిందని చెప్పింది. గతంలో తాను డేటింగ్ చేసిన ఓ వ్యక్తి ఈ క్యాండీ కారణంగానే తనతో రిలేషన్ ను వదిలేసుకున్నాడని అసలు జరిగిన దాని గురించి వివరణ కూడా అడగలేదని వాపోయింది. 

ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశంపైనే తేజశ్వితో పాటు మరో ముగ్గురు లేడీ ఆర్టిస్టులు కలిసి ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటించనున్నారు. దానిపేరు కమిట్‌మెంట్ (Commitment). లక్ష్మీకాంత్ చెన్నా దీనిని రూపొందిస్తున్నారు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రెండు నెలల క్రితమే విడుదల చేశారు.