Raja Saab : ప్ర‌భాస్ ‘రాజా సాబ్’ నుంచి హార‌ర్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది.. రేపే గ్లింప్స్ రిలీజ్‌

అక్టోబ‌ర్ 23న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

New Poster From Prabhas Raja Saab Movie

Raja Saab : అక్టోబ‌ర్ 23న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ క్ర‌మంలో ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అభిమానులు సిద్ధం అయ్యారు. ఇక అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇచ్చేందుకు డార్లింగ్ కూడా రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఆయ‌న న‌టిస్తున్న మూవీ రాజా సాబ్ నుంచి వ‌రుస అప్‌డేట్‌లు ఇస్తూ వ‌స్తున్నారు.

ఈ చిత్రంలో ప్ర‌భాస్ స్టైలిష్ లుక్‌ను నిన్న (సోమ‌వారం) విడుద‌ల చేశారు. అందులో ప్రభాస్ గళ్ళ‌ చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు. ఇక ప్ర‌భాస్ పుట్టిన రోజు నాడు గ్లింప్స్ ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో నేడు ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Naga Manikanta : బిగ్ బాస్ హౌస్‌లో ఆమెతో ఎక్కువ కనెక్ట్ అయ్యాను.. మణికంఠ కామెంట్స్

కుర్చీకి ఓ మూల‌న‌ మంట‌లు అంటుకుని ఉండ‌గా.. దాన్ని రివ‌ర్స్‌లో పోస్ట్ చేశారు. సింహాస‌నం ఖాళీగా లేదు.. ఓ వ్య‌క్తి కోసం అది వేచి ఉంది. అత‌డు రేపు వ‌స్తున్నాడు అంటూ దానికి క్యాప్ష‌న్ ఇచ్చింది.

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్థి కుమార్‌ హీరోయిన్లు. భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Naga Manikanta : బిగ్ బాస్ తర్వాత మణికంఠ తన భార్యతో కలిసాడా లేదా.. ఏమన్నాడంటే?