Chicken Party Song
Chicken Party Song : జబర్దస్త్ యాదమ్మ రాజు, బిందాస్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత రావు.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘భూతం ప్రేతం’. సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ బ్యానర్స్ పై బి. వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాజేష్ ధృవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
Also Read : Yash Rangineni : ‘ఛాంపియన్’ సినిమాలో విజయ్ దేవరకొండ మామయ్య.. ఈ ప్రొడ్యూసర్ గురించి తెలుసా..?
న్యూ ఇయర్ స్పెషల్‌గా పార్టీ సాంగ్ అంటూ ‘చికెన్ పార్టీ..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసారు. ఈ పాటను గిరీష్ హోతుర్ సంగీత దర్శకత్వంలో రాజేష్ ధృవ రాయగా అనిరుధ్ శాస్త్రి పాడారు. ఈ పాట వింటుంటే చికెన్, మందుతో పార్టీ చేసుకునే వాళ్లకు కరెక్ట్ గా సరిపోయేలా ఉంది. మీరు కూడా చికెన్ పార్టీ సాంగ్ వినేయండి..
Also Read : Vijaya Bhaskar : పాపం డైరెక్టర్ ని పక్కన పెట్టేశారా..? నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ ప్రమోషన్స్..