మహేష్ మేనల్లుడితో రొమాన్స్ చేయనున్న నిధి అగర్వాల్

గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో కథానాయికగా ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్‌‌ని ఎంపిక చేశారు..

  • Publish Date - November 8, 2019 / 07:11 AM IST

గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో కథానాయికగా ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్‌‌ని ఎంపిక చేశారు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతిల కుమారుడు గల్లా అశోక్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.. ‘భలే మంచి రోజు’, ‘శమంతక మణి’, ‘దేవదాస్’ చిత్రాలతో ప్రశంసలు దక్కించుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ తొలి సినిమా చేయనున్నాడు.

అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్‌‌ని ఎంపిక చేశారు.. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత నిధి పారితోషికం పెంచిదని, రూ.కోటి రూపాయలు తీసుకుంటుందని టాలీవుడ్ టాక్..

Read Also : తిప్పరామీసం – రివ్యూ..

ఈ నెల 10వ తేదీ ఉదయం 11 : 15 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు.. రామానాయుడు స్టూడియోస్‌లో ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులు మరియు సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా ప్రారంభోత్సవం జరుగనుంది. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వీకే నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. సంగీతం : జిబ్రాన్, కెమెరా : రిచర్డ్ ప్రసాద్.